: సీఐడీ ముందుకు శంకర్రావు
గ్రీన్ ఫీల్డ్స్ భూముల వ్యవహారంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు నేడు సీఐడీ ముందు హాజరయ్యారు. ఈ కేసులో శంకర్రావును పోలీసులు ఇంతకుముందు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ, నాంపల్లి కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో శంకర్రావు ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు.