: వైఎస్ జగన్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య!


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య కొద్ది సేపటి క్రితం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్యా చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధానికి లేఖ రాయాలని జగన్ ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మరో వారంలో లేఖను రాస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. కాపులను బీసీల్లో చేరిస్తే, బడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ చర్యలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, టీడీపీ టికెట్ పై ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, ఆపై క్రియాశీలకంగా లేరన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News