: తెలంగాణలో నేతల వలసలు మళ్లీ మొదలు, కాంగ్రెస్ టు టీఆర్ఎస్... చిట్టెం రామ్మోహన్ రెడ్డి!
తెలంగాణలో గత కొంతకాలంగా ఆగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే, ఈ దఫా కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు మొదలయ్యాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ టికెట్ పై మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ను కలిసిన ఆయన కాసేపు చర్చించారు. పార్టీ మారడం, మక్తల్ అభివద్ధిపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణకు సోదరుడైన చిట్టెం, తెరాసలో చేరడం ఖాయమని, నేడో రేపో ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. చిట్టెం రామ్మోహన్ రెడ్డి వచ్చారని తెలుసుకుని క్యాంపు ఆఫీసు వద్దకు మీడియా పరుగులు పెట్టడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.