: కోల్‌కతా పోలీస్ కమీషనర్‌ను బాధ్యతల నుంచి తప్పించిన ఈసీ.. వివాదాస్పద పనితీరే కారణం
కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. గత కొన్ని రోజులుగా రాజీవ్‌కుమార్‌పై ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న సౌమన్ మిత్రా కొత్తగా కోల్‌కతా పోలీస్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరిస్తారని వెల్లడించింది. ఇప్పటి కమీషనర్‌గా విధులు నిర్వహిస్తోన్న రాజీవ్‌కుమార్ పనితీరు వివాదాస్పదంగా ఉందంటూ ప్రతి పక్షాల నుంచి గత కొంత కాలంగా తమకు ఫిర్యాదులందుతున్నందున, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.