: రైల్లోంచి జారిపడ్డ 14నెల‌ల పసిబిడ్డ క్షేమం... తల్లి, మరో బిడ్డ మృతి!


ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు స‌మీపంలోని వ‌ట్లూరు రైల్వేట్రాక్ వ‌ద్ద వేగంగా వెళ్తున్న రైలులో నుంచి జారి ప‌డ్డ 14నెల‌ల చిన్నారి మృత్యుంజ‌యుడుగా నిలిచాడు. కాగా, త‌న 14నెల‌ల‌ ప‌సిబిడ్డ రైలులో నుంచి జారి ప‌డ‌డంతో ఆ చిన్నారిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో కంగారులో త‌న మ‌రో బిడ్డ‌తో క‌ల‌సి ఆ బాలుడి త‌ల్లి రైళ్లోంచి దూకేసింది. ప్ర‌మాదంలో రైళ్లోంచిదూకేసిన ఆ చిన్నారి త‌ల్లి, త‌న నాలుగేళ్ల బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు స‌మీపంలోని వ‌ట్లూరు రైల్వేట్రాక్ వ‌ద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై 14నెల‌ల ప‌సిబిడ్డ‌ను గుర్తించిన లైన్‌మెన్ ఆ చిన్నారిని ఆసుప‌త్రిలో చేర్పించాడు. రైల్వే ట్రాక్‌పై జారిప‌డిన ప‌సిబిడ్డ‌కు ఏలూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News