: సజీవ దహనమవుతున్న తండ్రి ప్రాణాలు నిలిపిన పదేళ్ల బాలిక


ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కోల్ కతా వ్యాపారి రాజీవ్ ఖన్నా, కుటుంబ సభ్యుల ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న వేళ, అతని పదేళ్ల కూతురు రాశి చేసిన పని ఆయన ప్రాణాలను కాపాడింది. ఓ వైపు రాజీవ్ ఖన్నా భార్యకు ఏం చేయాలో తోచక విలపిస్తుంటే, రాశి 100 నంబరుకు కాల్ చేసింది. తన తండ్రి చనిపోతున్నాడని, కాపాడాలని వేడుకుంది. తొలుత ఇదేదో ఆకతాయిల కాల్ అని భావించినప్పటికీ, విధి నిర్వహణే ముఖ్యమనుకున్న పోలీసు అధికారి వెంటనే పెట్రోలింగ్ టీమును పంపడంతో, 40 శాతం కాలిన గాయాలతో రాజీవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కోల్ కతాలోని సౌత్ సింథీ అపార్టుమెంట్ లో జరిగింది. కోల్ కతా పబ్లిక్ స్కూల్లో చదువుతున్న రాశి, మెట్రో స్టేషన్లలో, హోర్డింగ్ లపై 'డయల్ 100' ప్రకటనలను చూస్తూ ఉండేది. ఎప్పటిలానే స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన వేళ, తన తండ్రి కిరోసిన్ పోసుకునేందుకు ప్రయత్నిస్తుండటం, తల్లి ఏడుస్తుండటం చూసి భయపడినా, ఆ వెంటనే ధైర్యం తెచ్చుకుని 100కు కాల్ చేసిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆపై నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ టీముకు, వంటగదిలో నేలపై పడిపోయి ఉన్న రాజీవ్ కనిపించాడని, ఆంబులెన్స్ ను పిలిపించి ఆర్జీ కర్ ఆసుపత్రికి తరలించగా, ప్రాణాలు దక్కాయని వివరించారు.

  • Loading...

More Telugu News