: భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల ఆగ్రహం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించ తలపెట్టిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఏర్పాట్లలో అధికారుల తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారాముల కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణంలో పందిళ్లను వేయడంలో నిర్లక్ష్య ధోరణి కనబరిచిన దేవస్థాన అధికారులను ఆయన మందలించారు. ఎన్నిసార్లు చెప్పినా తన తీరు మార్చుకోని భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రాములోరి కల్యాణ వేడుకలపై పూర్తి శ్రద్ధ ఉంచాలని, లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. అక్కడి పనితీరును చక్కబెట్టే బాధ్యతను కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు అప్పగించారు.