: ఉత్తరప్రదేశ్‌లో టపాసుల చప్పుళ్లు తగ్గనున్నాయి
వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు పెరిగిపోతుండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో బాణసంచా కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు అగ్నికి ఆహుతవుతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. ప్రత్యేక సంబరాల్లో ప్రజలు బాణసంచా కాల్చాలనుకుంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. ఈనెల 21నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బాణసంచా కొనాలన్నా, కాల్చాలన్నా అనుమతి తీసుకోవాల్సిందేనని, పూర్తి జాగ్రత్తలు పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలే కేరళలో బాణసంచా పేల్చుతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.