: పొట్టి దుస్తుల యువతులు రేపర్ తీసిన చాక్లెట్లే: థాయ్ ప్రధాని


మహిళల వస్త్ర ధారణపై థాయ్ ల్యాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా చేసిన వ్యాఖ్యలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. థాయ్ లో సంప్రదాయ కొత్త సంవత్సరాది వేడుకలు జరుగుతున్న వేళ, యువత ఉత్సాహం ఏటేటా శ్రుతిమించుతుండగా, వాటిని ప్రస్తావించిన ప్రయూత్, శరీర అవయవాలు బయటకు కనిపించేలా పొట్టి, బిగుతు దుస్తులను యువతులు ధరించరాదని అన్నారు. పొట్టి దుస్తుల్లో కనిపించే వారు రేపర్ తీసిన చాక్లెట్ల వంటి వారని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని కోరారు. రేపర్ చుట్టి ఉంచిన చాక్లెట్, ఇంట్లో ఉంటే పాడుకాదని కూడా ఆయన అన్నారు. కాగా, థాయ్ లో 'సాంగ్ క్రాన్' పేరిట జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో రెయిన్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణ. ఈ సమయంలో అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపులపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతుంటాయి. ఇక ఆడవాళ్ల దుస్తులపై ప్రధాని వ్యాఖ్యలను థాయ్ మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.

  • Loading...

More Telugu News