: ‘ముంపు’ మండలాల పర్యటనకు చంద్రబాబు!... వద్దని వారించినా వినని ఏపీ సీఎం!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు కీలక పర్యటనకు బయలుదేరుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిశాయి. ఈ ఏడు మండలాల్లో కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో, మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ మండలాల్లో ఇప్పటిదాకా చంద్రబాబు అడుగుపెట్టలేదు. నిషేధిత మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పర్యటన అంత శ్రేయస్కరం కాదని పోలీసు అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే మొన్నటిదాకా పోలీసు అధికారుల మాట వింటూ వస్తున్న చంద్రబాబు తాజాగా ముంపు మండలాల్లో పర్యటనకే మొగ్గు చూపారు. ఏది ఏమైనా ఆ మండలాల్లో తాను పర్యటించి తీరాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు ముంపు మండలాల పర్యటన ఖరారైంది. నేడు ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ పలు అబివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అంతేకాక అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు అడుగుపెడుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News