: రాణించిన కోహ్లీ, డివిలియర్స్, సర్ఫ్ రాజ్...సన్ రైజర్స్ లక్ష్యం 228
సన్ రైజర్స్ హైదరాబాదుతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓపెనర్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ (1) వికెట్ ఆదిలోనే కోల్పోయింది. దీంతో మరో విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ క్రీజులో కోహ్లీతో జత కలిశాడు. ఇద్దరూ వీరవిహారం చేశారు. దీంతో స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఓపెనర్ కోహ్లీ 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేయగా, డివిలియర్స్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అనంతరం షేన్ వాట్సన్ కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేయగా, ఆ తరువాత వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ కేవలం పది బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. అతనికి జాదవ్ (8) చక్కని సహకారం అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 227 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో రాణించారు. 228 పరుగుల విజయ లక్ష్యంతో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఆరంభించింది.