: ఏడు గంటల్లో ఏడు లక్షల వీక్షణలు సాధించిన సల్మాన్ 'సుల్తాన్' ట్రైలర్


సల్మాన్ ఖాన్ స్టామినాను మరోసారి రుచి చూపించే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బాలీవుడ్ మాస్ మహారాజుగా వెలుగొందుతున్న సల్మాన్ ఖాన్ ఈద్ బహుమతిగా 'సుల్తాన్' సినిమాతో జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను యశ్ రాజ్ ఫిల్మ్స్ నేడు విడుదల చేసింది. ఈ ట్రైలర్ విడుదల చేసిన ఏడు గంటల్లో ఏడు లక్షల వ్యూస్ సాధించి, రికార్డు దిశగా సాగుతోంది. తన శరీరదారుఢ్యానికి తగ్గ కథను సల్మాన్ ఎంచుకున్నాడని ఈ ట్రైలర్ చూసిన ఎవరైనా అభిప్రాయపడాల్సిందే. 'సుల్తాన్' సినిమాలో సల్మాన్ లుక్ అదిరిపోయేలా ఉండడంతో ఇది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో...అని సినీ అభిమానులు అప్పుడే చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News