: ఒబామాతో విందుకు వెళ్తానో లేనో చెప్పలేను: ప్రియాంకా చోప్రా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విందు అంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఆయన నుంచి ఆహ్వానం అందితే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటిది ఒబామాతో విందుకు వెళ్తానో, వెళ్లలేనో ఇప్పుడే చెప్పలేనని ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా తెలిపింది. వైట్ హౌస్ లో ఒబామాతో విందు చేయాలని ఉన్నప్పటికీ ఆ విందుకు హాజరవుతానో, లేదో చెప్పలేనని ఆమె పేర్కొంది. 'క్వాంటికో' సీరియల్, 'బేవాచ్' సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడమే తన సందిగ్ధానికి కారణమని తెలిపింది. డిన్నర్ కు వెళ్తే మాత్రం వైట్ హౌస్ లో ఇది ఆయనకు చివరి ఏడాది కాబట్టి ఏం చేస్తారని అడుగుతానని ఆమె చెప్పింది. ఈ విందుకు హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్, లూసీ లియూ, జేన్ ఫోండా, గ్లేడిస్ నైట్ తదితర హాలీవుడ్ నటులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.