: ఓ అభిమాని వీరాభిమానం.. 600 కిలోల 'చాక్లెట్ రజనీకాంత్'!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చెన్నైకి చెందిన శ్రీనాథ్ బాలచంద్రన్ కు వీరాభిమానం. ఆ అభిమానం ఎంతంటే.. 600 కిలోల చాక్లెట్ ను ఉపయోగించి రజనీకాంత్ విగ్రహాన్ని తయారు చేసి ఈరోజే ఆవిష్కరించాడు. రజనీకాంత్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయనకు కానుకగా ఇవ్వనున్నట్లు చెప్పాడు. శ్రీనాథ్ కు ఒక సొంత రెస్టారెంట్ ఉంది. అయితే, ఈ విగ్రహం రజనీకాంత్ కు బదులు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాలా ఉందంటున్నవాళ్లు కూడా లేకపోలేదు. ఈ విమర్శలను తానేమీ పట్టించుకోనని శ్రీనాథ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News