: రొమాంటిక్ సీన్స్ చేయడం అంటే చాలా ఇబ్బందండీ!: పవన్ కల్యాణ్
రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, రొమాంటిక్ సీన్స్ అంటే నడుం చూడడడం, ఏదయినా సింగిల్ గా స్టెప్ వేయడం వంటి సీన్స్ లో తనకు ఇబ్బంది ఉండదని అన్నారు. అలాంటి సీన్స్ లో తన ఎదురుగా హీరోయిన్స్ ఉండరు కనుక, అలాంటి సీన్సును కెమెరా వైపు చూస్తూ చేయాలి కనుక, తనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. అదే రొమాంటిక్ సీన్ హీరోయిన్ తో చేయాల్సి వస్తే...ఆ షాట్ కు ముందు తాను ఒంటరిగా కూర్చుంటానని, ఆ సన్నివేశం ఒకే టేక్ లో వచ్చేందుకు ఏం చేయాలో ప్రణాళిక వేసుకుంటానని అన్నారు. ఇబ్బందిగా ఉందని అలాంటి సీన్స్ సినిమాలో లేకుండా చేయలేనని, తప్పదు కనుక చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.