: టాస్ గెలిచి బ్యాటింగ్ అప్పగించిన సన్ రైజర్స్ హైదరాబాదు...గేల్ అవుట్
ఐపీఎల్ సీజన్-9లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ తొలి మ్యాచ్ లు ఆడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా క్రిస్ గేల్ కు జతగా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం. నెహ్రా వేసిన ఓవర్ ను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న కోహ్లీ ఫోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తరువాతి ఓవర్ ను వేసిన భువనేశ్వర్ కుమార్ తొలి బంతిని వైడ్ వేశాడు. రెండో బంతిని అడ్డుకున్న గేల్ కు భువీ తరువాతి బంతికి చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఆ బంతికి గేల్ బౌల్డయ్యాడు. దీంతో 6 పరుగులకే గేల్ (1) పెవిలియన్ చేరాడు.