: ఆదర్శవంతమైన వివాహ విందు ఇచ్చిన టర్కీ నూతన జంట


తమ వివాహం సందర్భంగా బంధుమిత్రులకు విందు భోజనం పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అందుకు భిన్నంగా శరణార్థులకు విందు భోజనం పెట్టి ఓ టర్కీ జంట ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే...టర్కీలోని కిలిస్ పట్టణానికి చెందిన ఫతుల్లా ఉజ్ మ కోగ్లూ, ఎర్సా పొలాట్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ విషయం ఫతుల్లా తండ్రికి తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద శరణార్థులకు సేవలందించే కిమ్ సే యోక్ మూ అనే స్వచ్ఛంద సంస్థలో పని చేసే ఆయన బంధుమిత్రులకు విందు ఇచ్చే కంటే నిత్యం ఆకలితో అలమటించే సిరియా శరణార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. తొలుత దీనిని పట్టించుకోని ఈ నవదంపతులు తరువాత శరణార్థులకే భోజనం పెట్టాలని భావించి, 4000 మంది శరణార్థులకు వివాహ విందు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, శరణార్థులకు భోజనం పెట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తమలాగే ఇతరులు కూడా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలని నవ దంపతులు ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News