: 'గురుగ్రామ్'గా మారనున్న గుర్గావ్


హర్యాణాలోని గుర్గావ్ జిల్లా పేరును 'గురుగ్రామ్'గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుర్గావ్ జిల్లా అధికారిక వెబ్ సైట్ ప్రకారం పూర్వం ఈ జిల్లాను 'గురుగ్రామ్'గా పిలిచేవారని, కాలక్రమంలో దీని పేరు గుర్గావ్ గా మారిందని తెలిపింది. దీంతో దీనిని మళ్లీ 'గురుగ్రామ్'గా మార్చాలని నిర్ణయించారు. కాగా, హర్యాణాలోని గుర్గావ్ ప్రాతం పేరును కూడా మరుస్తారా? లేక జిల్లా పేరును మాత్రమే 'గురుగ్రామ్'గా మార్చనున్నారా? అన్నది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. దీనితో పాటు మేవత్ జిల్లా పేరును 'నుహ్' గా మార్చాలని హర్యాణా సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News