: సోనాక్షితో చిందేసిన కోహ్లీ...సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షీ సిన్హాతో విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. రోహిత్ శర్మ వివాహ వేడుక సందర్భంగా నిర్వహించిన సంగీత్ లో కోహ్లీ భాంగ్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇంతలో అదే వేదికపైకి సోనాక్షి రావడంతో ఆమె నటించిన 'రాంబో రాజ్ కుమార్' సినిమాలోని 'సాడీ కి ఫాలు సా' పాటకు ఇద్దరూ డ్యాన్స్ వేశారు. దీంతో ఈ వివాహ మహోత్సవానికి హాజరైన అతిధులు కేరింతలు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.