: మలింగ ఆట ఐపీఎల్-9లో లేనట్టే!
మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేని కారణంగా ఐపీఎల్-9లో శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ పాల్గొనే అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. మలింగాకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వడానికి ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఒప్పుకోలేదు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున మలింగ ఆడాల్సి ఉంది. అయితే తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంతో ఐపీఎల్‌లో మలింగ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. మలింగ పూర్తిగా కోలుకోవాల్సి ఉందని లంక క్రికెట్ బోర్డు చీఫ్ తిలంగ సుమతిపాల పేర్కొన్నారు. ఐపీల్-9 టోర్నీ మే 29 వరకు జరగనుంది. వీటిల్లో కనీసం చివరి మ్యాచులయినా మలింగ ఆడతాడని అభిమానులు ఆశపెట్టుకున్నారు.