: నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా
పద్మశ్రీ పురస్కారం అందుకోవడం తనకెంతో గర్వంగా, ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పేర్కొంది. ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తన జీవితంలోనే ఇది ఉత్తమమైన అవార్డు అని చెప్పింది. ఈ గౌరవం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. కాగా, ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్ నిమిత్తం లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఆమె ఈ పురస్కారాన్ని అందుకునేందుకు ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చింది.