: బాంబు ఎలా పనిచేస్తుందో చూపించమన్న జడ్జి.. పిన్‌ను లాగి బాంబు పేల్చేసిన కానిస్టేబుల్!
బాంబు ఎలా పనిచేస్తుందో చూపించమని ఓ కోర్టులో జడ్జి ఆర్డరేశారు. అలాగే అని తలూపుతూ.. బాంబుకున్న పిన్‌ను తొలగించాడు కానిస్టేబుల్.. ఇంకేముంది..! బాంబు ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ కానిస్టేబుల్ సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఓ కోర్టులో చోటుచేసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో గ్రనేడ్ పనితీరుపై తెలుసుకుందామని జడ్జి చేసిన ఈ అవివేకమైన ప్రయత్నానికి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో పడ్డారు. గ్రనేడ్ పనితీరును తెలుసుకుంటే తన కోర్టుకొచ్చే కేసుల్లో విచారణకు ఉపయోగపడుతుందని కానిస్టేబుల్‌ని ఇలా చేయమన్నానని, కానీ ఆ బాంబు ఒక్కసారిగా పేలిపోయిందని అనంతరం జడ్జి చెప్పుకొచ్చారు.