: పుట్టింగల్ ఘటనలో లొంగిపోయిన ఏడుగురు ఆలయ ట్రస్టీలు


కేరళలోని కొల్లంలో పుట్టింగల్ దేవాలయం వద్ద ఇంకా మందుగుండు సామగ్రి ఉందని తెలియడంతో కలకలం రేగింది. దేవాలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో 110 మంది మృత్యువాత పడగా, 300 మంది వరకు గాయపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దేవాలయం వద్ద మరింత మందుగుండు సామగ్రి ఉందని తెలియడంతో నిన్న మూడు కార్లలో ఉన్న ఆ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేఫథ్యంలో దేవాలయానికి చెందిన ఆలయ ట్రస్ట్ అధికారులు ఏడుగురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో వారిని విచారించిన పోలీసులు, వారిచ్చిన సమాచారం మేరకు దేవాలయం పరిసరాల్లో భారీ ఎత్తున దాచి ఉంచిన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News