: ఈ ఏడాది కరవు తీరా వర్షాలు!
ఈ ఏడాది కరవు తీరా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. 2016 రుతు పవనాల ప్రభావం సాధారణం కంటే 94 శాతం అధికంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఎల్.ఎస్.రాథోడ్ పేర్కొన్నారు. దేశంలోని కరవు రాష్ట్రాల్లో బాగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని రాథోడ్ వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్, సెప్టెంబర్ మాసాల మధ్య వర్షపాతం సాధారణం కన్నా 104 నుంచి 110 శాతం అధికంగా ఉండవచ్చని అన్నారు. గడచిన రెండేళ్లుగా రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండడంతో, దేశంలోని పలు రాష్ట్రాలు మంచి నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.