: ఇంతకీ కోహ్లీ దేనికి బ్రేక్ తీసుకున్నాడు?


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా ప్రత్యేకంగానే కనిపిస్తోంది. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో బ్రేకప్ అనంతరం తన ఆట గాడిన పడడంతో టీ20 ప్రపంచ కప్ లో వీరవిహారం చేశాడు. దీంతో టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. టోర్నీ ముగియగానే మాజీ ప్రేయసితో డిన్నర్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అనంతరం 'వి వర్ ఆన్ ఏ బ్రేక్' అనే నినాదం రాసి ఉన్న టీషర్టుతో దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఫోటో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ కోహ్లీ దేనికి బ్రేక్ చెప్పాడు? అని చర్చించుకుంటున్నారు. అనుష్కతో బ్రేకప్ నుంచి బ్రేక్ తీసుకున్నాడా? ...లేక అనుష్క నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడా? ఇంతకీ ఇలా సింబాలిక్ గా కోహ్లీ ఏం చెప్పాడంటూ తెగ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి కోహ్లీ అభిమానుల మెదడుకి మేత భలే పెట్టాడు.

  • Loading...

More Telugu News