: సిరియాలో కూలిన రష్యా హెలికాప్టర్... ఇద్దరు పైలట్ల మృతి
రష్యాకు చెందిన 'ఎంఐ28హెచ్' హెలికాప్టర్ సిరియాలో కూలిపోయింది. ఘటనలో ఇద్దరు రష్యా పైలట్లు మృతి చెందినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పైలట్ల మృతదేహాలను సిరియాలోని రష్యా వైమానిక స్థావరానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సిరియాలోని హోమ్స్ సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ హెలికాప్టర్‌ను పేల్చేసిన ఆనవాళ్లు కనపడలేదని, ఈ ఘటన కాల్పుల వల్ల జరిగింది కాదని అధికారులు పేర్కొన్నారు.