: నాలోని దర్శక రచయితలను మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టేశాను: పోసాని


ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. ఈరోజు ఈయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వెంకటేశ్వరుని అనుగ్రహంతో సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. 'మెంటల్ కృష్ణ' పాత్ర తరువాతి నుంచి తనకు నటనావకాశాలు పెరిగాయని చెప్పారు. దీంతో నటనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని పోసాని తెలిపారు. దీంతో తనలోని రచయితను, దర్శకుడిని మత్తుమందు (అనస్థీషియా) ఇచ్చి పడుకోబెట్టేశానని చమత్కరించారు. పూర్తి స్థాయిలో నటనతో బిజీగా ఉన్నందువల్ల వారిద్దరితో పని పడే అవకాశం లేదని పోసాని తనదైనశైలిలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News