: మారుతి సుజుకి నుంచి సరికొత్త స్మార్ట్ సిటీ కారు 'ఇగ్నిస్'
కార్ల అమ్మకాల్లో నమోదవుతున్న రెండంకెల వృద్ధి రేటును కొనసాగించడమే లక్ష్యంగా సరికొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. దీంతో పాటు బాలెనో వేరియంట్ లో కొత్త మోడల్ ను కూడా విడుదల చేస్తామని సంస్థ డైరెక్టర్ ఆర్ఎస్ కాల్సి వెల్లడించారు. తమ సంస్థ 'ఇగ్నిస్' పేరిట కొత్త కాంపాక్ట్ కారును విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇది కొత్త తరం ప్రజలకు సరికొత్తగా పరిచయం కానున్న స్మార్ట్ సిటీ కారుగా ఆయన అభివర్ణించారు. పట్టణ ప్రాంతాల వాతావరణానికి సరిపడేలా దీన్ని డిజైన్ చేశామని తెలిపారు. పెట్రోల్ వేరియంట్ లో ఇది లభిస్తుందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన బాలెనో మోడల్ లో 45 వేల యూనిట్లు విక్రయించామని, బ్రెజ్జా మోడల్ కు 38 వేల బుకింగ్స్ రాగా, 7 వేల యూనిట్లను డెలివరీ చేశామని తెలిపారు.