: నా సినిమాలకు నేను అభిమానిని కాదు...అందుకే చూడను: షారూఖ్


తన సినిమాలకు తాను అభిమానిని కాదని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తెలిపాడు. ఫ్యాన్ సినిమా ప్రమోషన్ లో షారూఖ్ మాట్లాడుతూ, నిజజీవితంలో తనకు తాను పెద్దగా నచ్చనని అన్నాడు. ఒకవేళ అలా నచ్చితే సినిమాల్లోని పాత్రల్లో జీవించలేనని చెప్పాడు. హీరో షారూఖ్ లా నటిస్తాను కనుకే తనకు తాను నచ్చనని స్పష్టం చేశాడు. అంతేకాదు, అభిమానులు చూసినట్టు తన సినిమాలను తాను ధియేటర్లలోనే కాదు కనీసం టీవీల్లో కూడా చూడనని అన్నాడు. షూటింగ్ సందర్భంగా ఆయా సన్నివేశాలను సాంకేతికంగా మానిటర్ లో మాత్రం చూడాల్సి వస్తుందని షారూఖ్ తెలిపాడు. ఏమైఅన, తన సినిమాలను చూసేందుకు తాను ఇష్టపడనని షారూఖ్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News