: భర్తతో కలసి విజయవాడకు వచ్చిన చిరు కూతురు శ్రీజ
ఇటీవల వివాహమైన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, తన భర్త కల్యాణ్ తో కలసి విజయవాడలో పర్యటించారు. ఈ ఉదయం కనకదుర్గమ్మ గుడికి వచ్చిన నూతన దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆపై దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆపై వారికి ప్రసాదాలు అందించారు. పింక్ కలర్ చీరలో శ్రీజ, కుర్తా, ప్యాంట్ లో కల్యాణ్ గుడిలో కాసేపు అటూ ఇటూ తిరుగగా, వీరిద్దరినీ చూడటానికి ఆ సమయంలో అక్కడున్న భక్తులు ఆసక్తి చూపారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.