: టీమిండియాతో ఓడిన రోజు రాత్రి మేమెవరం భోజనం చేయలేదు: బంగ్లా కెప్టెన్ ముర్తజా
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ పోరులో తాము చేయాల్సిన ఒకే ఒక్క పరుగు తమ ఆశల్ని నేల కూల్చిందని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మష్రఫె ముర్తజా అన్నాడు. ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న ఆయన క్రికెట్ ఆడుతోన్న స్థానిక యువకులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్ అనుభవాలను పంచుకున్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో ఒక్క పరుగుతో ఓటమి పాలై తాము చాలా నిరాశ చెందామని పేర్కొన్నాడు. గెలుపోటములు సాధారణమే అని తెలిసినా ఆ ఓటమిని తట్టుకోలేకపోయామని అన్నాడు. 'టీమిండియాతో ఓడిన ఆ రోజు రాత్రి మా ఆటగాళ్లం భోజనం చేయడం కూడా మానేశాం' అని పేర్కొన్నాడు. ఓటమి భారాన్ని మోయడం చాలా కష్టమని అన్నాడు. ఈ సందర్భంగా మష్రఫె ముర్తజా అక్కడ క్రికెట్ ఆడుతోన్న యువకులకు ఆటలో మెళుకువలను గురించి చెప్పాడు.