: అమెరికాలో దుండగుల కాల్పులు... భారత సంతతి విద్యార్థి మృతి
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో భారత సంతతి విద్యార్థి మరణించిన దారుణ ఘటన న్యూయార్క్ సమీపంలో జరిగింది. యూఎస్ ఫెడరల్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఇక్కడి రుత్గర్స్ యూనివర్శిటీలో షానీ పటేల్ (21) విద్యను అభ్యసిస్తున్నాడు. ఆయన నివాసానికి వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి పరారు కాగా, పటేల్ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడికి గాయాలయ్యాయి. దాడిలో ఇద్దరు పాల్గొన్నారని, వారు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారన్న విషయమై విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.