: అలా నినదించాలంటే నాకు నో ప్రాబ్లం.. కన్నయ్యకు సరైన గైడెన్స్ అవసరం: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
'భారత్ మాతాకీ జై' నినాదం దేవుడికి, అల్లాకి అతీతమైందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. భారత్‌లో జాతీయవాద వివాదం రచ్చ చేస్తోన్న నేపథ్యంలో ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అంశంపై స్పందించారు. తాను మాత్రం ఆ నినాదాన్ని గర్వంగా పలుకుతానని చెప్పారు. అయితే పలు నినాదాలు చేయడంపై ఎవ్వరినీ బలవంతపెట్టకూడదని పేర్కొన్నారు. తమకు ఇష్టం లేని నినాదాలు చేయని వారిని జాతి వ్యతిరేకులుగా చూడకూడదని చెప్పారు. మాతృభూమిని ప్రేమించడం దేశంలోని ప్రతీ పౌరుడికీ గర్వించే అంశం అని చెప్పారు. అందువల్లే గర్వకారణమైన 'భారత్ మాతాకీ జై' వంటి నినాదాలు చేస్తానని పేర్కొన్నారు. దేశంలో వివాదాస్పదంగా మారిన జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్నయ్య కుమార్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కన్నయ్యకు సరైన గైడెన్స్ కావాలన్నారు. అనంతరం వాహనాల ట్రాఫిక్, కాలుష్యాన్ని నిరోధించడానికి ఢిల్లీలో ఉపయోగిస్తున్న సరి-బేసీ విధానాన్ని గురించి మాట్లాడుతూ... ఆ విధానాన్ని శాశ్వతంగా అమలుపరచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.