: పాక్ జైల్లో దారుణం... హత్యగు గురైన భారతీయ ఖైదీ!


పాకిస్థాన్ లోని లఖ్ పత్ జైల్లో 1992 నుంచి ఖైదీగా ఉన్న భారత జాతీయుడు క్రిపాల్ సింగ్ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న ఉదయం జైలు గదిలో క్రిపాల్ విగత జీవిగా కనిపించాడని లఖ్ పత్ జైలు అధికారి పీటీఐకి వివరించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిన్నా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. 1992లో మద్యం సేవించిన మత్తులో క్రిపాల్ వాఘా సరిహద్దు దాటగా, గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలతో పాక్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కనీసం తన అన్న మృతదేహాన్నయినా ఇండియాకు తెప్పించాలని, ఈ దిశగా భారత ప్రభుత్వం కృషి చేయాలని క్రిపాల్ సోదరి జాగిర్ కౌర్ కోరారు. ఏప్రిల్ 2013లో సరబ్ జిత్ సింగ్ ను దారుణంగా హత్య చేసి చంపేసినట్టుగానే క్రిపాల్ ను హత్య చేశారని సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ ఆరోపించారు. ఆయన మరణం సాధారణం కాదని అన్నారు. దాదాపు 24 సంవత్సరాలుగా క్రిపాల్ జైల్లో మగ్గుతుండగా, అతన్ని విడుదల చేయాలని పలుమార్లు భారత ప్రభుత్వం కోరినప్పటికీ, పాక్ స్పందించలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News