: రాజమౌళి పద్మశ్రీ అందుకున్న వేళ...!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజమౌళి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హీరో రజనీకాంత్, రామోజీరావు సహా ఆడిటోరియంలోని ప్రతిఒక్కరూ చప్పట్లతో అభినందించారు. రాష్ట్రపతికి వినమ్రంగా నమస్కరించి, రాజమౌళి తన అవార్డును అందుకున్నారు. ఈ సమయంలో ఆహూతుల్లోని రాజమౌళి సతీమణి రమా రాజమౌళి మోములో అమితానందం కనిపించింది. కాగా, పద్మవిభూషణ్ అందుకున్న వారిలో రజనీకాంత్, రామోజీరావులతో పాటు వాసుదేవ కల్ కుంటే ఆత్రే, గిరిజాదేవి, విశ్వనాథన్ శాంతలు కూడా ఉన్నారు. పద్మశ్రీ అవార్డులను అందుకున్న వారిలో మన్నం గోపీచంద్ ఉన్నారు.