: పక్కపక్కనే పద్మవిభూషణులు రామోజీరావు, రజనీకాంత్
ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల మలి విడత ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. పద్మ అవార్డు గ్రహీతల్లో రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు, సూపర్ స్టార్ రజనీకాంత్ లు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. రజనీకాంత్ అవార్డును అందుకుంటున్న వేళ ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, గాయకుడు ఉదిత్ నారాయణ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.