: ఆ 306 మంది భారత విద్యార్థులపై చర్యలు తప్పవు: అమెరికా
అనుకున్నదే జరుగుతోంది. మోసపు వర్శిటీ అని తెలిసికూడా, అందులో ప్రవేశం పొందడం ద్వారా అమెరికాలో అక్రమంగా నివసించాలని భావించిన 306 మంది ఇండియన్ స్టూడెంట్స్ పై చర్యలు తప్పవని అమెరికా వెల్లడించింది. హెచ్-1బీ వీసా పొడిగింపునకు అర్హత సాధించలేకపోయిన వీరు, ఓ నకిలీ యూనివర్శిటీలో ప్రవేశాలు పొంది యూఎస్ లో ఉండిపోవాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య జరిగిన ఓ స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయం వెల్లడి కాగా, మొత్తం 32 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. అధికారులే బోగస్ వర్శిటీని సృష్టించి, విద్యార్థులపై వల విసరగా, బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి, వీసా పొడిగింపును పొందలేకపోయిన వారి నుంచి భారీగా డబ్బు తీసుకుని వర్శిటీలో ప్రవేశాన్ని ఇప్పించారు. మరికొందరు బ్రోకర్ల ప్రమేయం లేకుండానే వర్శిటీలో చేరారు. మొత్తం 1000 మందికి పైగా వర్శిటీలో చేరగా, అందులో విషయం తెలిసుండీ, తప్పు చేద్దామన్న భావనతో ప్రవేశాలు పొందిన వారిపై మాత్రమే చర్యలుంటాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.