: ఆ పులి మొహంపై 'క్యాట్'... పర్యాటకుల చూపంతా దానిపైనే!
మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులో ఓ పులి మొహంపై క్యాట్ అని ఆంగ్ల అక్షరాలలో ఎవరో రాసినట్లుగా ఉండే దాని చారలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మున్నా అని ముద్దుగా పిలుచుకునే ఆ టైగర్‌పై సీఏటీ( క్యాట్) అని కనిపించేలా ఉన్న చారలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించడానికి పోటీ పడుతూ ఉంటారు. మున్నాపై ఉన్న ఈ చారలు ఆ జాతీయ పార్కుకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లికి పులి పోలికలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. పులిపై క్యాట్ అని ఇలా దర్శనమిస్తుండడం పర్యాటకులను ఆకర్షిస్తోంది.