: దున్నపోతు తప్పిపోయిందట... ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
వారణాసిలో గోడలపై ఓ వింత ప్రకటనతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. సారనాథ్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ పాండే అనే వ్యక్తికి చెందిన మూడేళ్ల దున్నపోతు (పేరు బాద్షా అట) తప్పిపోయిందట. వారం రోజుల క్రితం బాద్షా తప్పిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడు మనోజ్ కుమార్. ఇక బాద్షా చిత్రాలతో కూడిన పోస్టర్లను ముద్రించి, దాని ఆచూకీ చెబితే రూ. 50 వేలు బహుమతిగా ఇస్తానని ప్రచారం చేస్తున్నాడు. అది కేవలం జంతువు కాదని, తమ కుటుంబంలోని సభ్యుడని, వంటగది, పడక గదుల్లోకి సైతం వస్తుందని, ఎవరినీ ఏమీ చేయదని మనోజ్ బాధతో చెబుతున్నాడు. ఇక మనోజ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్, తన గేదెలు పోయాయని ఫిర్యాదు చేసిన వేళ, ఏడుగురు సీనియర్ పోలీసు అధికారులను నియమించి మరీ సెర్చింగ్ నిర్వహించి వాటిని కనిపెట్టిన పోలీసులు, మనోజ్ ఫిర్యాదును మాత్రం లైట్ తీసుకున్నారు.