: అమరావతా మజాకా... ఆరు నెలల్లో 4 కోట్లు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయిన సీఆర్డీయే అధికారి!


అమరావతి... నవ్యాంధ్రకు నూతన రాజధానిగా నిర్మాణం కానున్న నగరం. ఈ నగర నిర్మాణం కోసం ఏర్పడిన సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)లో పట్టణ ప్రణాళికా అధికారిగా లభించిన అవకాశం. ఇంకేముంది, ఆ అధికారి అక్రమాలకు తెరలేపాడు. ఆరేడు నెలల వ్యవధిలో రూ. 4 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టాడంటే, అవినీతి ఏ మేరకు చేసుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆదాయానికి మించి ఆస్తులను దాచుకున్నాడన్న ఆరోపణలపై సీఆర్డీయే పట్టణ ప్రణాళిక అధికారి రెహమాన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయగా, వెలుగులోకి వచ్చిన సత్యమిది. గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలోని 11 చోట్ల అధికారులు దాడులు చేయగా, ఆయన ఇంట్లో విదేశీ కరెన్సీ కూడా దొరికినట్టు తెలుస్తోంది. పలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. రెహమాన్, ఆయన సమీప బంధువుల ఇళ్లలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News