: పెళ్లి రోజున కూడా స్కూలుకు వెళ్లి పాఠాలు చెప్పిన టీచరమ్మ


పనిలోనే దైవముందని భావించే వారు కరవైన ఈ రోజుల్లో ఓ ముస్లిం యువతి, తన వివాహం రోజున కూడా విధులకు వెళ్లి వృత్తిపై తన నిబద్ధతను చూపిన ఘటన బీహారులో జరిగింది. పెళ్లంటే ముందో వారం, తరువాతో రెండువారాలు సెలవు పెడుతున్న ఈ రోజుల్లో నిఖా రోజు కూడా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠం చెప్పి వచ్చిన తాహిర్ ఫాతిమా అందరికీ ఆదర్శంగా నిలిచింది. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని సరాన్ జిల్లా లష్కరీపూర్ లోని ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్న ఆమెకు శనివారం నాడు నిఖా, ఆదివారం నాడు బిదాయి నిశ్చయమైంది. ఈ రెండు రోజులు కూడా ఆమె సెలవు పెట్టలేదు. అడిగిన వాళ్లకు పెళ్లితో పాటు పిల్లలకు పాఠాలు కూడా ముఖ్యమే కదా? అని ఎదురు ప్రశ్నించింది. రోజు మాదిరే స్కూలుకు వెళ్లి విధులు ముగించుకుని వచ్చి నిఖా చేసుకుంది. ఇప్పుడు ఫాతిమాకు జిల్లా విద్యాధికారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉర్దూ పాఠశాలలకు శుక్రవారం సెలవు కాగా, శని, ఆదివారాలు పనిచేస్తాయన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News