: డొనాల్డ్ ట్రంప్ పిల్లలు ఆయనకు ఓటేయలేకపోతున్నారు!
రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఐదుగురు పిల్లల్లో ఇద్దరు ఆయనకు అనుకూలంగా ఓటేయబోవడం లేదు. ఆయన కుమార్తె ఇవాంకా, కుమారుడు ఎరిక్ లు న్యూయార్క్ రాష్ట్రంలో రిపబ్లికన్లుగా నమోదు చేయించుకోలేదట. ఈ కారణంగా త్వరలో జరిగే న్యూయార్క్ ప్రైమరీల్లో ట్రంప్ కు అనుకూలంగా వీరిద్దరూ ఓటేయలేకపోతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 9 లోగా రిపబ్లికన్ల తరఫున రిజిస్టర్ కావాల్సిన వీరు, తన ఏమరుపాటు లేమి కారణంగానే రిజిస్టర్ కాలేకపోయారని ట్రంప్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాత్రం తన తండ్రి కోసం ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఆయన నాలుగో బిడ్డ టిఫానీ ట్రంప్ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో, ఐదోవాడు బారన్ ట్రంప్ కు ఇప్పుడు కేవలం పదేళ్లే. 2024లోగాని అతనికి ఓటు హక్కు రాదు.