: మా బావొచ్చాడు... మా పెదనాన్నొచ్చాడు!: వేదికపైనే జ్యోతులతో బంధుత్వాన్ని చెప్పుకున్న టీడీపీ నేతలు


వైసీపీ టికెట్ పై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ రాజకీయ నేత జ్యోతుల నెహ్రూ నిన్న టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేతలు బంధుత్వాలను గుర్తు చేసుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూకు రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరుంది. అంతేకాక తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగానూ మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో జ్యోతులతో టీడీపీ నేతలు తమ బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ రోజు మా బావ చేరాడు’’ అంటూ తూర్పుగోదావరి జిల్లాకే చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు... జ్యోతులతో తన బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నారు. గడచిన ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూపై జగ్గంపేటలో పోటి చేసి ఓడిన ఆయన సోదరుడి కుమారుడు జ్యోతుల చంటిబాబు కూడా వెనువెంటనే స్పందించారు. జ్యోతులతో తన బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నా పెదతండ్రి జ్యోతుల తిరిగి టీడీపీలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని చంటిబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News