: కర్నూలులోనూ మొదలైన కార్డాన్ అండ్ సెర్చ్!... నాటుసారా, అనుమతి లేని వాహనాలు స్వాధీనం


హైదరాబాదు జంట నగరాల్లో నిత్యకృత్యంలా మారిన కార్డాన్ అండ్ సెర్చ్ (కట్టడి -తనిఖి) సోదాలు తాజాగా జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. ఏపీలోని కర్నూలు నగరంలో నిన్న రాత్రి ఆ జిల్లా పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు చేశారు. నగరంలోని ప్రజానగర్ కాలనీని చుట్టుముట్టిన వంద మంది పోలీసులు ఆ కాలనీని దాదాపుగా దిగ్బంధించారు. ఈ క్రమంలో ఆ నగర్ లోని ఇంటింటిని జల్లెడ పట్టిన పోలీసులు గుర్తింపు పత్రాలు లేని పది ఆటోలు, పది బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా కాలనీలోని పలు ఇళ్లలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు, నాటు సారా నిల్వలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయా ఇళ్లలోని వారిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News