: కృష్ణానగర్ ను చుట్టుముట్టిన 400 మంది పోలీసులు... బెంబేలెత్తిన జూనియర్ ఆర్టిస్టులు


హైదరాబాదు జంట నగరాల్లో పోలీసుల కట్టడి-తనిఖీ (కార్డాన్ అండ్ సెర్చ్)లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను చుట్టుముట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని కృష్ణానగర్ ను నిన్న రాత్రి 400 మంది పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రంగంలోకి దిగిన వందలాది మంది పోలీసులు కృష్ణానగర్ తో పాటు యూసుఫ్ గూడ పరిధిలోని పలు ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో అనుమానంగా కనిపించిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గుర్తింపు పత్రాలు లేని 46 బైకులతో పాటు 12 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 46 సిలిండర్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వందలాది మంది పోలీసులు అక్కడ ప్రత్యక్షమవడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టాలీవుడ్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టులకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న కృష్ణానగర్ లో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కలకలం రేగింది. పోలీసుల బూట్ల చప్పుళ్లతో జూనియర్ ఆర్టిస్టులు బెంబేలెత్తిపోయారు.

  • Loading...

More Telugu News