: మోదీజీ.. ఈ ఫోటో చూశారా? ఎంత దారుణం!: క్రికెటర్ హర్భజన్ సింగ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒక ఫొటో పోస్టు చేశారు. ఆ ఫొటోలో ఒక మహిళను పోలీస్ కానిస్టేబుల్ తన లాఠీతో చితకబాదుతున్నాడు. ఆమె చేతిలో బిడ్డ కూడా ఉంది. ఈ ఫొటోను హర్భజన్ పోస్టు చేశాడు. ఇటువంటి దారుణాలను ఎంతమాత్రం సహించలేమని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు...చితక బాదితే ఎలా? అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇటువంటి దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తాయని, మన దేశం గురించి తెలియజెప్పేవి ఇటువంటి ఫొటోలా? చాలా అవమానకరమంటూ హర్భజన్ సింగ్ ఆ ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు.