: '24' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం: సురేష్ బాబు, కొరటాల, పైడిపల్లి


సూర్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ రూపొందించిన '24' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగిన '24' ఆడియో వేడుకలో సురేశ్ బాబు మాట్లాడుతూ, రెహమాన్ ఎదుగుదలను చూస్తున్నానని, ఆయన అంత పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. సూర్యకు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. దిల్ రాజు, వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, సినిమా యూనిట్ ను విజయం వరిస్తుందని అన్నారు. రెహమాన్ సంగీతం గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ఏ సినిమా కోసం ఇంత ఆసక్తిగా ఎదురు చూడలేదని అన్నారు.

  • Loading...

More Telugu News