: టీఎస్ఆర్టీసీకి రూ.600 కోట్లు నష్టం: జేఎండీ రమణారావు


టీఎస్ ఆర్టీసీకి నష్టం వాటిల్లిందని జేఎండీ రమణారావు పేర్కొన్నారు. 2015-16 ఫిబ్రవరి వరకు ఆర్టీసీకి రూ.600 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. సిబ్బందికి పెరిగిన జీతభత్యాల వల్ల సంస్థపై ఆర్థిక భారం పెరిగిందని, నిర్వహణ వ్యయం తగ్గింపు, సమర్థత పెంచి నష్టాలు తగ్గిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ నష్టాలు తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. దూరప్రాంతాలకు త్వరలో 150 కొత్త బస్సులు నడుపుతామని, మే 15 నాటికి 10 ఏసీ లగ్జరీ బస్సులు ప్రవేశపెడతామని రమణారావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News