: పవన్ కల్యాణ్ గురించి ఇక నా జీవితంలో ట్వీట్ చేయను: రాంగోపాల్ వర్మ ప్రతిజ్ఞ!
ఇకపై పవన్ కల్యాణ్ గురించి ఎటువంటి ట్వీట్ చేయనని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. తాను సదుద్దేశంతో పవన్ కల్యాణ్ పై ట్వీట్లు చేస్తున్నప్పటికీ ప్రతిఒక్కరూ అపార్థం చేసుకుంటున్నారని అన్నారు. ఇకపై తన జీవితంలో పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ అనేది చేయనని, ఇదే తన చివరి ట్వీట్ అంటూ...‘బైబై పీకే ఫ్యాన్స్’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ గురించి, ఆయన అభిమానుల గురించి తరచుగా ప్రస్తావించే వర్మ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమే!