: కర్ణాటక హైకోర్టు ప్రాంగణలో ఉద్రిక్తత...అగ్రిగోల్డ్ యజమానికి చెప్పులతో సన్మానం


కర్ణాటక హైకోర్టులో నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. అగ్రిగోల్డ్ మోసంపై బాధితులు కోర్టు ఆవరణలో వారిని నిలదీశారు. ఈ సందర్భంగా వారిపై కోపం కట్టలు తెంచుకోవడంతో బాధితులు వారిని దొరకబుచ్చుకున్నారు. లాయర్లు, పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా బాధితులు వెనక్కి తగ్గలేదు. చెప్పులు, పిడిగుద్దులతో వారిపై విరుచుకుపడ్డారు. దీంతో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి. పైసా పైసా కూడబెట్టి దాచుకుంటే...తమ డబ్బుతో ఆస్తులు సమకూర్చుకుంటారా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News